నాని మళ్లీ నిరాశ పరచాడు..!

నాచురల్ స్టార్ నాని మస్త్ జబర్దస్త్ ఫాంలో ఉన్నా సరే తన రేంజ్ హిట్ అందుకోవడంలో కాస్త వెనుకపడ్డాడని చెప్పాలి. నాని రీసెంట్ మూవీ మజ్ను ఇప్పటిదాకా 11 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన భలే భలే మగాడివోయ్ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అంటే దాదాపు 27 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇక ఈ సంవత్సరం ముందు వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ 10 కోట్ల పైన దగ్గరే ఆగిపోగా జెంటిల్ మన్ 17 కోట్ల పైన వసూళు చేసింది.    

ఇక మజ్ను ఇప్పటికి 11 కోట్ల మార్క్ దాటేసింది కాని 20 కోట్ల టార్గెట్ దాటాలంటే కష్టమే అంటున్నారు. దసరా బరిలో దిగిన నాలుగు సినిమాల్లో హిట్ గా నిలిచిన ప్రేమం ఓ రేంజ్ కలక్షన్స్ సాధించే అవకాశాలున్నాయి. ఇక మొదట హిట్ టాక్ తెచ్చుకున్నా నాని సినిమా టోటల్ రన్ లో మాత్రం యావరేజ్ గానే నిలుస్తున్నాడు. ఈ విషయంపై ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్న నాని ప్రస్తుతం చేస్తున్న నేను లోకల్ తో ఆశ తీరేలా చేస్తాడేమో చూడాలి. నక్కిన త్రినాధ రావు డైరెక్ట్ చేస్తున్న నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.