సంబంధిత వార్తలు
తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు బాసటగా నిలిచి ప్రోత్సహిస్తునందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ “హ్యాట్స్ ఆఫ్ సిఎం కేసీఆర్ సర్...” అంటూ విజయవాడలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు ఓ పక్క, మద్యలో జనసేనాని, భీమ్లా నాయక్ హీరో పవన్ కల్యాణ్, మరోవైపు వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చిత్రాలు ముద్రించారు. నిన్న భీమ్లా నాయక్ సినిమా విడుదలను పురస్కరించుకొని కృష్ణలంకకు చెందిన అభిమానులు విజయవాడలో ఈ ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేశారు.