
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న జూనియర్ ఇక అదే స్టాండర్డ్ లో తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం వక్కంతం వంశీ, పూరి జగన్నాథ్ ఇద్దరిలో ఎవరి డైరక్షన్లో సినిమా చేయాలో తెలియక కన్ ఫ్యూజన్ లో ఉన్న తారక్ ఇప్పుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ సోషియో ఫ్యాంటసీ సినిమా తీస్తాడని టాక్ వచ్చింది.
ఆ సినిమా కూడా బాహుబలి రేంజ్లో ఉండబోతుందని అన్నారు. కాని ఈ విషయంపై జూనియర్ సన్నిహితులు మాత్రం అదో పెద్ద రూమర్ అంటున్నారు. ప్రస్తుతం తను తర్వాత సినిమా మీద ఎలాంటి డెశిషన్ ఫైనల్ చేయలేదట. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అయితే అసలు చర్చలే జరుగలేదు అంటున్నారు. సో ఇదంతా ఎవరో పుట్టించిన గాసిప్పే అన్నమాట.
ఇక రాజమౌళి మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తీస్తే కనుక అది ఖచ్చితంగా తారక్ తోనే అని చెప్పేశాడు. కాబట్టి రాఘవేంద్ర రావు మిస్ అయినా జక్కన్న మహాభారతం మాత్రం మిస్ చేసుకునే ఛాన్స్ లేదు.