పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు సోదరుడు...మరి ఏపీకి?

నిన్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మంత్రి కేటీఆర్‌, “భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా నా సోదరులు  పవన్‌ కల్యాణ్‌, రానా, తమన్, సాగర్ చంద్రలకు శుభాకాంక్షలు తెలిపేందుకే నా రోజువారి కార్యక్రమాల నుంచి బ్రేక్ తీసుకొన్నాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో  పద్మశ్రీ మొగిలయ్యగారిని, శివమణి వంటి అద్భుతమైన సంగీత విద్వాంసులను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది,” అని ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు తెలుగు సినీ పరిశ్రమను దానిలో వారిని ఈవిదంగా అక్కన చేర్చుకొని ఆదరిస్తుంటే, సినీ పరిశ్రమకు పుట్టినిల్లు వంటి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సినీ దోపిడీని అరికట్టి సామాన్యులకు వినోదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే మిషతో ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమపై ఆంక్షలు విధించి టికెట్ రేట్లు తగ్గించి ఊపిరి సలపకుండా చేస్తోంది. మళ్ళీ సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని కోరుతోంది. 

భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌, రానాలను ‘నా సోదరులంటూ..’ మంత్రి కేటీఆర్‌ ఆత్మీయంగా సంబోధిస్తే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజకీయ శత్రువుగానే చూస్తుండటం విశేషం.