ప్రముఖ మలయాళీ నటి లలిత మృతి

ప్రముఖ మలయాళీ నటి కేపీఏసీ లలిత (74) మృతి చెందారు. గత కొన్నిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 

కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. అయితే కేపీఏసీ అనే మలయాళ చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించడంతో అప్పటి నుంచి ఆమెకు కేపీఏసీ లలితగా గుర్తింపు పొందారు. ఆమె తన సినీ జీవితంలో 550కి పైగా సినిమాలలో నటించారు. కేరళ సంగీత నాటక అకాడమికి 5 ఏళ్ళు ఛైర్ పర్సన్‌గా వ్యవహరించారు. ఉత్తమ సహాయ నటిగా రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకొన్నారు. మలయాళ చిత్రసీమలో కేపీఏసీ లలితను అందరూ లెజండరీగా భావించి గౌరవిస్తుంటారు.  

కేపీఏసీ లలిత భర్త ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత స్వర్గీయ భరతన్. వారికి సిద్దార్థ్ భరతన్, శ్రీకుట్టి భరతన్ అనే ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు.  

కేపీఏసీ లలిత మృతి పట్ల కేరళ సిఎం పినరయి విజయన్, మలయాళ చిత్ర సీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.