శాతకర్ణి ఫస్ట్ లుక్..!

నందమూరి నట సింహం బాలయ్య బాబు 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో చేరాయి. బాలకృష్ణ బర్త్ డే నాడు సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా బాలయ్య ఫేస్ సగం బయట పెట్టిన క్రిష్ కొద్ది గంటల క్రితం బాలయ్య బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఎంతో ఇంటెన్స్ తో బాలకృష్ణ లుక్ అదుర్స్ అనేలా ఉంది. గౌతమి పుత్రుడుగా బాలయ్య బాబు తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. 

ఇప్పటికే భారీ షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా సగానికి పైగా పూర్తి చేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి జనవరి 13న రిలీజ్ చేయాలనేది క్రిష్ ఆలోచన. శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయమాలిని గౌమిపుత్రగా నటిస్తుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాయి బాబు, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

మరి ఫస్ట్ లుక్ అయితే సినిమా స్థాయిని ఇంకాస్త పెంచింది. ఇక దసరా గిఫ్ట్ గా విజయ దశమి రోజు ఉదయం సినిమా తీజర్ కూడా రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. సినిమా కూడా.  అసలు శాతకర్ణి కథ ఎలా కొనసాగింది అన్నది తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.