రేపే భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఏపీ మంత్రి మేకపల్లి గౌతమ్ రెడ్డి హాటాన్మరణంతో భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 25న సినిమా విడుదలవుతున్నందున ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారా లేదా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను నిర్మించిన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారికి తీపి కబురు తెలిపింది. బుదవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో పోలీస్ గ్రౌండ్స్‌లో భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా  ప్రకటించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ముఖ్య అథితిగా హాజరవుతారు.  

భీమ్లా నాయక్‌లో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా నిత్యా మీనన్,  రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించారు. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, తమన్ సంగీతం సమకూర్చారు.