సంబంధిత వార్తలు

మెగాస్టార్ చిరంజీవి అర్దాంగి,
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెతో ఆచార్య సెట్‌లో చిరంజీవి, రామ్
చరణ్ కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా గురించి నీకు తెలిసినంతగా
మరెవరికీ తెలియదు. హ్యాపీ బర్త్ డే అమ్మా.. అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అలనాటి
ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ అని అందరికీ తెలిసిందే.
ఒక గొప్ప నటుడికి కుమార్తెగా, మరో గొప్ప నటుడికి భార్యగా, మరో గొప్ప నటుడికి తల్లి అయిన సురేఖ తన కుటుంబానికే పరిమితం అయ్యారు.