.jpg)
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. హిందీ వెర్షన్‌లో పెన్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతం అందించారు. చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా, సోనుసూద్ విలన్లుగా నటిస్తున్నారు. ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
గత సంవత్సరం విడుదలైన ‘పుష్ప’ సినిమా హిందీలో కూడా బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్లను సునామీని సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆచార్యను కూడా హిందీలో విడుదల చేస్తుండటంతో ఇది కూడా బాక్స్ ఆఫీసు కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.