
గతంలో ఎప్పుడు ఏ సినిమాలు విడుదలవుతాయని మాత్రమే తెలుసుకొంటే సరిపోయేది కానీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ హాట్ స్టార్, జీ5, ఆహా వంటి ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తరువాత వాటిలో కూడా నేరుగా చిన్నా పెద్దా కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. సూర్య నటించిన జైభీమ్ నేరుగా ఓటీటీలో విడుదల కాగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప థియేటర్లో విడుదలైన రెండువారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్, తెలుగుతో సహా అన్ని భారతీయ బాషలలో విడుదలవుతున్న చాలా సినిమాలు ఇప్పుడు సబ్ టైటిల్స్‌తో వస్తున్నాయి. కనుక ఇతర భాషలలోని మంచి చిత్రాలను చూసి ఆనందించే అవకాశం కలుగుతోంది. ఇక అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఇంగ్లీష్, తెలుగుతో సహా అన్ని భారతీయ బాషలలో రూపొందుతున్న వెబ్ సిరీస్ కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఫ్యామిలీ మెన్ ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కనుక ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోవడం కూడా అవసరమే. నిన్న గురువారం ఒక్కరోజే ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. ఆ వివరాలు:
నెట్‌ఫ్లిక్స్:
1. ఎరాక్స్ (ఇంగ్లీష్ సినిమా), (తెలుగు, తమిళ్, హిందీ డబ్బింగ్); .
2. ఫిస్ట్ ఫుల్ ఆఫ్ వెంజెన్స్: (ఇంగ్లీష్ సినిమా);
3. ఫర్ గివ్ అస్ అవర్ ట్రెస్‌పాసస్ : (ఇంగ్లీష్ సినిమా) (హిందీ డబ్బింగ్);
4. హర్ట్ షార్ట్ : (ఇంగ్లీష్ సినిమా);
5. ఎస్కేప్ రూమ్ : (ఇంగ్లీష్ సినిమా);
6. మో గిలిగాన్: దేర్ ఈస్ మో టు లైఫ్ (ఇంగ్లీష్) స్టాండప్ కామెడీ;
7. యంగ్ వాలెండర్ సీజన్: టీవీ షో;
8. కీపింగ్ అప్ విత్ కార్ డాషియన్స్ (సీజన్ 10): టీవీ షో
అమెజాన్ ప్రైమ్:
ఫ్యామిలీ ప్యాక్ (కన్నడ సినిమా).