సంబంధిత వార్తలు

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా షూటింగ్ బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ‘దసరా’ అని టైటిల్ ఖరారు చేశారు. సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతంలో ఓ గ్రామంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనిలో నాని మొదటిసారిగా తెలంగాణ యాసతో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహెబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.