ఫిబ్రవరి 25 నుంచి బిగ్‌ బాస్ నాన్-స్టాప్

నాగార్జున వ్యాఖ్యాతగా తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌ బాస్’ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులకు నాగార్జున మరో శుభవార్త అందించాడు. ఫిబ్రవరి 26 నుంచి ‘బిగ్‌ బాస్ నాన్‌స్టాప్’ డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అందుకు సంబంధించిన ప్రోమో వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న పోటీదారుల వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.