సంబంధిత వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. 2020లో వచ్చిన మలయాళ సినిమా ‘అయ్యప్పన్ కోషియుమ్’ను భీమ్లా నాయక్‌గా తెలుగులో పునర్నిర్మించారు. ఈ సినిమాకు సాగర్ కే చంద్రర్ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్.తమన్ స్వరాలందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను అందించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ పవన్ కళ్యాణ్, రానాలకు జోడిలుగా నటిస్తున్నారు.