సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ విడుదలకు ముందే యూట్యూబ్‌లో అదరగొడుతుంది. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని ‘కళావతి’ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి కూడా యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. సర్కారువారి పాటలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించగా, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సర్కారువారి పాట ప్రపంచ వ్యాప్తంగా మే 12న విడుదల కానుంది.