మే 27న విడుదలవుతున్న ఎఫ్-3

కరోనా కేసులు తగ్గుతుండటంతో మళ్ళీ కొత్త సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ శిరీష్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన  ‘ఎఫ్-3 మే 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబందించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. 

ఎఫ్-2 సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అంజలి, మురళి శర్మ, అలీ, సునీల్, కె ఆర్ విజయ, అన్నపూర్ణ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.