మే 27న రంగ రంగ వైభవంగా వస్తున్న వైష్ణవ్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌

మెగాస్టార్ చిరంజీవి రెండో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ‘రంగ రంగ వైభవంగా’ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది  చిత్రయూనిట్. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి, బివిఎస్ ప్రసాద్ సంయుక్తంగా  ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను నిర్మించారు. వైష్ణవ్ తేజ్‌కు జోడీగా కేతికశర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. కానీ ఆయన రెండో సినిమా ‘కొండపొలం’ చిత్రంలో తన నటనతో మెప్పించారు. దానిలో నటించిన నటీనటులు, దర్శకుడు మంచి పేరు కూడా వచ్చింది కానీ సినిమా విజయం సాధించలేక పోయింది. మూడో సినిమా అయిన ‘రంగ రంగ వైభవంగా’ తప్పకుండా తనకు మంచి హిట్ అందిస్తుందని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నాడు.