ఫిబ్రవరి 18న జీ5లో బంగార్రాజు విడుదల

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కలిసి నటించిన ‘బంగార్రాజు’ ఈనెల 18 నుంచి జి 5 ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియో, జీ సినిమా స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వం వహించగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించారు. 

గత నెల సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా ను విడుదల చేశారు. అయితే  ఈ సినిమా  మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 2016లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ దానంతగా హిట్ అవ్వలేకపోయింది.