వాల్తేర్ శీనుగా వస్తున్న సుమంత్

తెలుగు సినీ పరిశ్రమలో చాలా వెనుకబడిపోయిన అక్కినేని సుమంత్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా ‘వాల్తేర్ శీను’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐమా ఆయనకు జంటగా నటిస్తున్నారు. మధునందన్, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు కె రాబిన్స్ సంగీతం అందించారు. నిన్న సుమంత్ పుట్టినరోజు సందర్భంగా వాల్తేర్ శీను పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దానిలో సుమంత్ ఎప్పటిలాగే మాస్ లుక్‌తో కనిపించాడు. విశాఖపట్టణం రౌడీయిజం నేపథ్యంలో వాల్తేర్ శీను సినిమా తెరకెక్కనుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ పూర్తవగానే విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.

సుమంత్ ఇంతకు ముందు విభిన్నమైన కథలతో సినిమాలు చేశారు కానీ వాటిలో సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్, కపటదారి సినిమాలు బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకొన్నాయి.