ఆడవాళ్లు మీకు జోహార్లు... టీజర్ నేడే

ఫ్యామిలీ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్ ఈరోజు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. కుష్బూ, ఊర్వశి, రాధిక, సత్య రాజ్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించగా, కిషోర్  తిరుమల దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ సోనీ లైవ్ కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక శర్వా సినీ కెరీర్‌లో కాస్త వెనుకబడ్డారు. ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.