ఫిబ్రవరి 14న సర్కారువారి పాట...లిరికల్ వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబందించి చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని ‘కళావతి..’ లిరికల్ వీడియో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 

రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లలో దీనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. సర్కారువారి పాట మే 12న విడుదల ప్రపంచవ్యాప్తంగా కానుంది. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించగా, ఎస్ఎస్ ధమన్ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన  పోస్టర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.