మే27న వస్తున్న మేజర్

ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్.’ దీని విడుదల తేదీ ఖరారయ్యింది. మే 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  

ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో శోభితా ధూళిపాళ, సయసి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాను జి.ఎన్.బి ఎంటర్‌టైన్‌మెంట్,  ఏ ప్లస్ఎస్ మూవీస్,  సోనీ పిక్చర్స్ బ్యానర్లపై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మేజర్ ట్రైలర్‌కువిశేష స్పందన వస్తోంది.