లైగర్ షూటింగ్ సమాప్తం

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ (సాల క్రాస్ బ్రీడ్) చివరి షెడ్యూల్ పూర్తయినట్టు ప్రకటించింది చిత్రబృందం. ఇందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా, తనీష్ బాగాచి, మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాతో విజయ దేవరకొండ బాలీవుడ్‌లో కూడా తన సత్తా నిరూపించుకోవాలనుకొంటున్నారు.