నెదర్లాండ్ సింగర్ నోట..చూపే బంగారమాయేలే...

కళలకు ఎల్లలు లేవనే మాట పుష్ప సినిమాలో పాటలు, అల్లు అర్జున్‌, రష్మిక వాటికి చేసిన డ్యాన్సులు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, క్రీడాకారులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పుష్ప పాటలకు స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నెదర్లాండ్స్ దేశానికి చెందిన గాయని ఎమ్మా హీస్టర్స్ పుష్పలో చూపే బంగారమాయేలే... శ్రీవల్లి... పాటను అద్భుతంగా ఇంగ్లీషులో అనువదించి పాడారు. ఆ పాటకు హైలైట్‌గా నిలిచిన ‘చూపే బంగారమాయేలే... శ్రీవల్లి...మాటే మాణిక్యమాయెలే...శ్రీవల్లీ...’ అనే చరణాన్ని ఆమె తెలుగులోనే పాడటం విశేషం. ఈ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆమె పాడిన పాటను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది చూసి నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఆమె పాడిన ఈ పాటను మీరూ విని ఆనందించండి...