అంటే సుందరానికి 8 రిలీజ్ డేట్లు!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికి’ విడుదలకు ఏకంగా 8 తేదీలను ప్రకటించింది చిత్ర యూనిట్. వాటిలో ఏప్రిల్ నెలలో 22 లేదా 29, మే నెలలో 6 లేదా 20 లేదా 27వ తేదీలు, చివరిగా జూన్ నెలలో 3 లేదా 10వ తేదీలలో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబందించి గురువారం ట్విట్టర్‌లో కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ విషయం తెలిపారు. 

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియా ఫహాద్ నటించింది. రాహుల్ రామకృష్ణ, నదియా, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు చేశారు.