మే 20న గోపీ చంద్ పక్కా కమర్షియల్ రిలీజ్

గోపీచంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాను మే 20న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌, ‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్‌ను కూడా నిన్న విడుదల చేశారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా  నిర్మించాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు జాకెస్ బేజోయ్ సంగీతాన్ని అందించారు. దివంగత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ టైటిల్ సాంగ్‌ను హేమచంద్ర పాడారు. గత కొన్నేళ్ళుగా సరైన హిట్ లేని హీరో హీరో గోపీచంద్ ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు .