ఫిబ్రవరి 3న మహేష్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ షురూ

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా తీయబోతున్నట్లు నిర్మాత రాధాకృష్ణ చాలాకాలం క్రితమే ప్రకటించారు. ఈ నెల 3వ తేదీన ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఆరోజున పూజా కార్యక్రమాలు పూర్తిచేసి లాంఛనంగా సినిమా షూటింగ్ మొదలుపెడతారు. దీనిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోంది. హారికా అండ హాసిని క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తారు. 

మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు అతడు, ఖలేజా రెండు సినిమాలు వచ్చాయి. అతడు సూపర్ హిట్ కాగా ఖలేజాకు మిశ్రమ స్పందన వచ్చింది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట మే 12వ తేదీన విడుదల కాబోతోంది.