ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా సలార్‌లో ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు ఆద్య అని పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సలార్ మూవీని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ భాషలలో తీసి, తరువాత తమిళ్, మలయాళం, హిందీ భాషలలో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. హొంబలే ఫిలింస్ బ్యానర్‌లో విజయ్ కిరగండూర్ దీనిని నిర్మిస్తున్నారు.
సలార్‌లో జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నారు. ఈశ్వరీ రావు, మధు గురుస్వామి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బన్సూర్ అందిస్తున్నారు. సలార్ ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు.