నెట్‌ఫ్లిక్స్‌లో రాధేశ్యామ్?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలకావలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దాంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాధేశ్యామ్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని అంతకు ముందు నుంచే పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిని రాధేశ్యామ్ దర్శక నిర్మాతలు ఖండిస్తూనే ఉన్నారు. ఎంత ఆలస్యమైనా రాధేశ్యామ్‌ను థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తామని చెపుతున్నారు. వారు ఓటీటీ పుకార్లను ఖండిస్తున్నప్పటికీ అవి మాత్రం ఆగకపోవడం విశేషం. తాజాగా రాధేశ్యామ్ సినిమాను దక్కించుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌, జీ5 భారీగా ఆఫర్ చేశాయని, నిర్మాతలు కూడా సానుకూలంగాణే స్పందించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ లేదా జీ5లో రాధేశ్యామ్ విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక వీటిపై మళ్ళీ దర్శక నిర్మాతలు స్పందించి స్పష్టత ఈయవలసి ఉంది. 

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా పూజా హెగ్డే చేసింది. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ రొమాంటిక్ వింటేజ్ లవ్ స్టోరీలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడుగా, కృష్ణంరాజు పరమహంసగా చేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియెషన్స్ రెండూ కలిసి పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో సిద్దం అవుతోంది. దక్షిణాది భాషల వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీలో అనూమాలిక్, మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.