సంబంధిత వార్తలు
మాస్ మహారజా రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతీ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఖిలాడి చిత్రంలో నాలుగో పాటను ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సాగర్, మమతా శర్మ పాడిన హుషారైన పాట ఫుల్ కిక్కుకు రవితేజ, డింపుల్ హయాతీ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ బ్యానర్లపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.