మెగాస్టార్ చిరంజీవికి మళ్ళీ కరోనా

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనబడటంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకొని, అవసరమైతే చికిత్స తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. స్వల్ప లక్షణాలు తప్ప ఎటువంటి ఇబ్బందీ లేదని త్వరలోనే మీ అందరినీ కలుసుకొంటానని అన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి 2020 నవంబర్‌లో ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు పరీక్షించుకోగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో కొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకొని కోలుకొన్న తరువాత మళ్ళీ ఆచార్య షూటింగ్‌లో పాల్గొన్నారు.