వేసవిలో వస్తున్న అంటే సుందరానికి...

న్యాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. అటువంటి సీరియస్ చిత్రం తరువాత పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘అంటే సుందరానికి’ అనే మరో సినిమా కూడా పూర్తి చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నెని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నానికి జంటగా నజ్రియా ఫహాద్ నటించింది. రాహుల్ రామకృష్ణ, నదియా, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది.