సంబంధిత వార్తలు

కోలీవుడ్ హీరో విక్రమ్ తన కుమారుడు ధృవ్ విక్రమ్ తో కలిసి నటించిన చిత్రం మహాన్ వచ్చే నెల 10వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్స్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. సిమ్రాన్, బాబీ సింహా, సంతానం తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ కరోనా కారణంగా ఇంతవరకు రిలీజ్ చేయలేకపోయారు. కనుక ఫిబ్రవరి 10వ తేదీన నేరుగా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించారు.