సంబంధిత వార్తలు

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా నటించిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఏవరేజ్ టాక్ తెచ్చుకొన్న ఈ సినిమా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆహా ఓటీటీలో విడుదల కాబోతోంది. అర్జున ఫల్గుణలో నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, రంగస్థలం మహేశ్, రాజ్‌కుమార్ చౌదరి, దేవీ ప్రసాద్ ముఖ్య పాత్రలు చేశారు.