అందరిలా ఉంటే అతను రాంగోపాల్ వర్మ ఎందుకవుతాడు?సంక్రాంతి పండుగకు వర్మ తనదైన శైలిలో ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు.
“ప్రజలందరూ అంబానీకంటే ధనవంతులు కావాలి..అంబానీ ఇల్లు కంటే పెద్ద ఇల్లు ఉండాలి. ఇప్పుడూ ఎప్పుడూ కూడా మీకు ఏ వైరస్ సోకకూడదు. మగవారికి ప్రపంచంలోకెల్ల అందమైన భార్యలు రావాలి. అలాగే ఆడవాళ్ళకి మంచి అందగాడైన భర్తలు దొరకాలి. భర్తలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ భార్యలు మిమ్మల్ని ఏమీ కోరుకోకుండా మీరు ఏమి చేసినా భరించాలని ఆ దేవుడిని కోరుకొంటున్నాను. చిన్న సినీ దర్శక నిర్మాతలందరికీ శుభాకాంక్షలు. మీ సినిమాలన్నీ బాహుబలి కంటే సూపర్ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. నన్ను ద్వేషించేవారందరికీ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కోసం నేను త్వరగా చనిపోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను,” అని ట్వీట్స్ చేశారు.