సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ మొట్టి మొదటి సినిమా గంగోత్రిని, తాజాగా విడుదలైన పుష్పను చూస్తే నటనలో ఎంతగా ఎదిగిపోయాడో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దక్షిణాదిన అన్ని రాష్ట్రాలలో అల్లు అర్జున్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పుష్పతో ఉత్తరాది రాష్ట్రాలను కూడా షేక్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో బన్నీ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. తాజాగా బన్నీ ఇంస్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ క్రాస్ చేయడంతో బన్నీ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. బన్నీకి ట్విట్టర్‌లో 6 మిలియన్ ఫాలోవర్స్, ఫేస్‌బుక్‌లో ఏకంగా 21 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.