ఆర్ఆర్ఆర్ నుంచి సంక్రాంతి సర్‌ప్రైజ్

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ ఈ సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, కరోనా కేసులు పెరగడం, థియేటర్లు మూతపడుతుండటంతో రిలీజ్ వాయిదా పడింది. బాహుబలి తరువాత రాజమౌళి తీసిన చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో తీవ్ర నిరాశ చెందారు. అయితే ఆర్ఆర్ఆర్ నిర్మాతలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ్ళ ఆర్ఆర్ఆర్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు. ఆర్ఆర్ఆర్‌లో జూ.ఎన్టీఆర్‌ తెలంగాణ పోరాట వీరుడు కుమురుం భీంగాను, రామ్ చరణ్‌ అల్లూరి రామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమా ఇంకా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి పోస్టర్ విడుదల చేయడం చాలా సంతోషమే కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి ఏళ్ళ తరబడి తీసిన సినిమాను విడుదల చేయవలసిన సమయానికి కేవలం పోస్టర్ విడుదల చేయవలసి రావడం బాధాకరమే కదా?