
సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సీమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నాగ చైతన్య పాల్గొన్నప్పుడు ఓ విలేఖరి ‘సమంతతో విడిపోవడానికి కారణం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించగా, “మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నాము. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది నేను సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే ఏమి కావాలి?” అని చైతు జవాబు ఇచ్చాడు.
సమంత కూడా ఇంతవరకు తాము విడిపోవడానికి కారణం చెప్పలేదు కానీ ఆ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, కానీ ఇంత త్వరగా తేరుకొని ఆ బాధ నుంచి బయటపడగలటం తనకే ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.
అయితే సమంత అక్కినేని కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే పాత్రలు, సినిమాలు చేస్తునందుకే వారి మద్య మనస్పర్ధాలు మొదలై అవి విడాకులకు దారి తీసాయని వారి మాటలు, సమంత చేస్తున్న సినిమాలతో తేటతెల్లమవుతోంది.