సంబంధిత వార్తలు

డా.రాజశేఖర్, శివానీ తండ్రీ కూతుర్లుగా నటిస్తున్న శేఖర్ సినిమా త్వరలో విడుదల కానుంది. శేఖర్‌లో వారి ఫస్ట్ లుక్ స్టిల్స్‌ని రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాకు డా.రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించారు. ఆమె, వారి కుమార్తె శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డితో కలిసి ఈ సినిమాను నిర్మించారు. తన భర్త డా.రాజశేఖర్, తమ కుమార్తె శివాని ఇద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారని ఆమె తెలిపారు. డా.రాజశేఖర్ ఇమేజికి తగ్గట్లుగానే ఈ సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని జీవితా రాజశేఖర్ తెలిపారు.