త్వరలో రామ్ చరణ్‌ కొత్త సినిమా షూటింగ్ షురూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసిన తరువాత కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు. నాచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’తో సూపర్ డూపర్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియెషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా తీయబోతున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించి నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అలాగే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యన్‌ను కూడా కధ సిద్దం చేయమని రామ్ చరణ్‌ కోరినట్లు తెలుస్తోంది.