హీరోగా వస్తున్న గల్లా అశోక్

గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో సినీపరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన హీరో ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో ఈరోజు విడుదల చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గళ్ళ పద్మావతి నిర్మించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, సీనియర్ నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ హీరో సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న విడుదలకాబోతోంది.

సంగీతం: గిబ్రన్, కెమెరా: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.