కట్టప్పకు కరోనా... చెన్నై ఆసుపత్రిలో అడ్మిట్

సినీ పరిశ్రమపై కరోనా మహమ్మారి మళ్ళీ మరోసారి విరుచుకు పడుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు, కమల్ హాసన్‌, విక్రమ్, మీనా, త్రిష, మనోజ్, విశ్వక్ సేన్, తమన్, వడివేలు, లక్ష్మి తదితరులు కరోనాబారిన పడ్డారు. అయితే వారందరూ స్వల్ప లక్షణాలతోనే కరోనా నుంచి విముక్తి పొందుతున్నారు. తాజాగా కట్టప్ప (సత్యరాజ్) కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో చెన్నైలోని తన ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉంటున్నారు. కానీ నిన్న రాత్రి ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతునట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా సమాచారం తెలియవలసి ఉంది.