పోలీస్ ఆఫీసరుగా ప్రభాస్ స్పిరిట్

ఆరడుగుల అందగాడు ప్రభాస్ ఇప్పటి వరకు 24 సినిమాలు చేశాడు కానీ ఇంతవరకు పోలీస్ ఆఫీసరుగా చేయలేదని అభిమానులు బాధపడుతుంటారు. ప్రభాస్ తన 25వ సినిమాతో వారి కోరిక తీర్చబోతున్నాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్న ఈ సినిమాకు ‘స్పిరిట్’ అని పేరు ఖరారు చేసినట్లు టీ-సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్‌ ప్రకటించారు. దీనిలో తొలిసారిగా ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసరుగా చేయబోతున్నాడు. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఇది పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి నటీనటులు, టెక్నీషియన్స్ తదితర వివరాలు ప్రకటించి షూటింగ్ మొదలుపెడతామని తెలిపారు. దీనిని భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయి.     

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఈనెల 14న దేశవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. కానీ దేశంలో థియేటర్లు మూతపడుతుండటం లేదా 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో రాధేశ్యామ్‌ రిలీజ్‌ అవుతుందా లేదా? అనేది ఇంకా తెలియవలసి ఉంది.