
విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్‌గా చేస్తున్న లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు విడుదలైంది. దీనిలో హీరో ఇంట్రడక్షన్ చూస్తే హాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్లోనే తొలిసారిగా అత్యధిక బడ్జెట్ రూ.125 కోట్లతో లైగర్ తీస్తున్నారు. కనుక ఫస్ట్ గ్లింప్స్ కూడా ఆ స్థాయిలోనే చాలా అద్భుతంగా ఉంది. లైగర్‌లో ప్రముఖ అంతర్జాతీయ మాజీ బాక్సర్ మైక్ టైసన్ విలన్ పాత్రలో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనన్య పాండేను హీరోయిన్గా పరిచయం అవుతోంది.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో లైగర్ విడుదలవుతుంది. కనుక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి లైగర్‌ను నిర్మిస్తున్నారు. లైగర్‌లో రమ్యకృష్ణ, విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. లైగర్ 2022 ఆగస్ట్ 25న విడుదలవుతుంది.