
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లైగర్ సినిమా (సాల క్రాస్ బ్రీడ్ సబ్ టైటిల్) షూటింగ్ చివరి దశకు చేరుకొంది. త్వరలోనే చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి 2022 ఆగస్ట్ 25న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ ఏడాది ముగింపు నేటి నుంచి డిసెంబర్ 31వరకు వరుసగా ప్రతీరోజు లైగర్ హంగామా ఉంటుందని చెప్పారు. విజయ్ దేవరకొండ అభిమానుల కోసం ఇవాళ్ళ బిగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేస్తామని తెలిపారు. గురువారం లైగర్ స్పెషల్ స్టిల్స్, శుక్రవారం లైగర్ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తామని పూరి జగన్నాథ్ తెలియజేశారు.
మార్షల్ ఆర్ట్స్ కధాంశంగా రూపొందుతున్న లైగర్‌లో ప్రముఖ అంతర్జాతీయ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. దీనిలో హీరో విజయ్ దేవరకొండ క్లినికల్ ట్రయల్స్‌కు బాక్సర్‌గా నటిస్తున్నాడు. కనుక వీరిరువురికీ మద్య క్లైమాక్స్ సీన్‌లో తప్పనిసరిగా ఓ ఫైటింగ్ సీన్ ఉంటుంది. మరి అదెలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో లైగర్ విడుదలవుతుంది. దీనిని పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. లైగర్‌లో రమ్యకృష్ణ, విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు.