సంబంధిత వార్తలు

ప్రముఖ దర్శకుడు కెఎస్. సేతు మాధవన్ (90) శుక్రవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
సేతు మాధవన్ 1931లో కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌లో జన్మించారు. 1961లో తొలిసారిగా మలయాళం సినిమాకు దర్శకత్వం వహించి సినీ రంగంలో ప్రవేశించారు. ఆ తరువాత మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో 60కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 1995లో రిలీజ్ అయిన స్త్రీ అనే ఓ తెలుగు సినిమాకు సేతు మాధవన్ దర్శకత్వం వహించారు.