గత 105 రోజులుగా తీవ్ర విమర్శలు, వివాదాలు, ఆసక్తికరమైన సంఘటనలతో సాగిన బిగ్‌బాస్ (తెలుగు) సీజన్-5 ఎట్టకేలకు మొన్న ఆదివారంతో ముగిసింది. ఈ షోలో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన మానస్, శ్రీరామ్, సిరి ఎలిమినేట్ అవడంతో సన్నీ, షన్నులు మాత్రమే మిగిలారు. వారిద్దరిలో ఖమ్మంకు చెందిన టీవీ సీరియల్ నటుడు సన్నీ విజేతగా నిలిచాడు.
విజే సన్నీ గురించి క్లుప్తంగా... విజే సన్నీ అసలు పేరు అరుణ్. 1989, ఆగస్ట్ 17న ఖమ్మం జిల్లాలో జన్మించాడు. సన్నీ తల్లితండ్రుల పేర్లు వెంకటేశ్వర్లు, కళావతి. సన్నీ ఖమ్మం నిర్మలా హైస్కూల్లో 10వ తరగతి వరకు, ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కళ్యాణ వైభోగం తెలుగు టీవీ సీరియల్‌తో తన కెరీర్ ప్రారంభించాడు. నాగార్జున హోస్ట్‌గా స్టార్ మా, డిస్నీ హాట్ స్టార్ ఛానల్స్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని 19 మందితో పోటీ పడి చివరికి విజేతగా నిలిచాడు. ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు అందుకొన్నాడు.