
పుష్ప సినిమా ఒక ఎత్తైతే అందులో సమంత చేసిన ‘ఊ అంటావా మావా... ఊఊ అంటావా మావా...’ ఐటెమ్ సాంగ్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఇంద్రావతి చౌహాన్ మత్తెక్కించే గొంతుతో పాడిన ఈ పాటకు సమంత చేసిన డ్యాన్స్ కుర్రకారును షేక్ చేస్తోంది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ రికార్డు బద్దలుకొట్టింది. ఇంతగా పాపులర్ అయిన ఈ సాంగ్‌పై ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో పురుషుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులను ఆశ్రయించాయి. ఈ పాటపై ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కుర్రకారు ‘ఊ అంటావా మావా... ఊఊ అంటావా మావా...’ అంటూ హమ్ చేస్తున్నారు. ఈ పాట...దానికి తాను డ్యాన్స్ చేయడంపై వస్తున్న విమర్శలకు జవాబుగా సమంత ఇద్దరు యువకులు ఈ పాటపై తీసిన ఓ ఫన్నీ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. అది చూస్తే మరో సమాధానం అవసరమే ఉండదు. అదేమిటో మీరు చూడండి.
My situation like this 😂😂🤣🤣 pic.twitter.com/SBl9phdOnN
— Sai (@Sai06801539) December 19, 2021