ఊ అంటావా...సాంగ్‌కి ఎంత ఖర్చయిందో తెలుసా?

పుష్ప శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సమంత ఊ అంటావా మావా... ఊఊ అంటావా మావా...’ అంటూ సాగే ఓ ప్రత్యేక గీతానికి చేసిన డ్యాన్స్ అదిరిపోతోంది. ఈ ఒక్క పాటకే 45 మిలియన్స్ వ్యూస్‌ వచ్చాయంటే ఎంత పాపులర్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. నాగ చైతన్య నుంచి విడిపోయిన బాధలో ఉన్నప్పుడు సమంత ఈ పాటకు డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడమే విశేషమనుకొంటే, దీని కోసం నిర్మాతలు ఆమెకు కోటి రూపాయలు ముట్టజెప్పడం మరో విశేషం. అంతేకాదు..‘తగ్గేదేలే... అంటూ పుష్ప నిర్మాతలు ఈ ఒక్క పాట సెట్, చిత్రీకరణ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.