
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నెట్ఫ్లిక్స్ సంస్థ ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు చాలా భారీగా చెల్లించి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకొన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త గుప్పుమంది. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా ఏదోరోజు ఓటీటీలో కూడా ఆ బొమ్మ పడాల్సిందే. కనుక ఈ వార్త అబద్దం కాకపోవచ్చు. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలైన రెండు నెలల తరువాత నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ అంతవరకు రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆగలేరు కనుక ముందు థియేటర్లలో దానిని తనివితీరా చూసి తరువాత నెట్ఫ్లిక్స్లో వస్తే మళ్ళీ మరోసారి చూసి ఆనందించవచ్చు.