ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు

సినిమా రిలీజ్‌లకు దసరా-దీపావళి సీజన్, తరువాత డిసెంబర్‌, జనవరిలో క్రిస్మస్-కొత్త సంవత్సరం-సంక్రాంతి సీజన్, తరువాత వేసవి సెలవుల సీజన్... ఇలా మూడు ప్రధాన సీజన్లు ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, డిస్నీ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తరువాత సినీ ప్రియులకు ఏడాది పొడవునా ప్రతీ వారమూ పండుగ సీజనులాగ మారింది. ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు లేదా వెబ్‌సిరీస్ విడుదలవుతూ అందరినీ అలరిస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు కొన్ని డైరెక్టుగా ఓటీటీలలో రిలీజ్ అవుతుంటే, కొన్ని థియేటర్లలో విడుదలైన 4-6 వారాలకు ఓటీటీలలో రిలీజ్ అవుతుండటంతో సినీ ప్రేమికుల ఆనందానికి అవధులే లేవు. ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌: 

ఆహాలో డిసెంబర్‌ 17న రాజ్‌ తరుణ్ హీరోగా నటించిన ‘అనుభవించు రాజా’ స్ట్రీమింగ్ కాబోతోంది. గత నెల 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కనుక ఓటీటీ ప్రేక్షకులు ఓ లుక్ వేయొచ్చు.       

నెట్‌ఫ్లిక్స్: డిసెంబర్‌ 17న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (హాలీవుడ్ మూవీ), ద విచ్చర్ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్); కడశీల బిర్యాని (తమిళ్); 

 జీ5: డిసెంబర్‌ 17న  420 ఐపీసీ (హిందీ) సినిమా; 

సోనీ లైవ్: డిసెంబర్‌ 16న ద విజిల్ బ్లోయర్ (హిందీ వెబ్‌ సిరీస్‌) విడుదల కాబోతున్నాయి.

చివరాఖరిగా మరిచిపోకుండా చెప్పుకోవలసిన సినిమా: పుష్ప. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.